సఖి సెంటర్ ని సందర్శించిన ఎస్పీ కిరణ్ కారే
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్ ని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే సందర్శించారు. బాధిత మహిళలకు సఖి సెంటర్ అందిస్తున్న సేవ లను గూర్చి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రిని అడిగి తెలుసుకున్నా రు. గత రెండు రోజులుగా షెల్టర్ లో ఉంటున్న బాధిత మహిళను పలకరించి ఆమె సమస్యను అడిగి తెలుసుకుని తన సమస్యను త్వరగా పూర్తిచేయాలని సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రికి సూచిం చారు. బాధిత మహిళల సమస్యలను పరిష్కరించడం కోసం సఖి సెంటర్ కి మా సహాయం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అనం తరం సఖి పోస్టర్ని ఆవిష్కరించి, బాధిత మహిళలకు సఖి సెంటర్ అందిస్తున్న సేవలను గూర్చి సఖి సిబ్బందిని అభినందించారు.
1 thought on “సఖి సెంటర్ ని సందర్శించిన ఎస్పీ కిరణ్ కారే ”