ప్రశాంతంగా ముగిసిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు
పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్
కాటారం, జనవరి 13,(తెలంగాణ జ్యోతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపాలపల్లి నందు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ డ్రాయింగ్ హైయర్, లోయర్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ పరీక్షలు నాల్గవరోజు జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ సందర్శించారు. ఉదయం మరియు సాయంత్రం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలిపారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ 159 మంది దరఖాస్తు చేసుకోగా 113 మంది హాజరైనట్లు 46 మంది గైర్హాజరు అయినట్లు డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ 50 మంది దరఖాస్తు చేసుకోగా 46 మంది హాజరైనట్లు 4 గురు గైర్హాజరైనట్లు తెలియజేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పరీక్ష కేంద్రంలో త్రాగునీరు విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. వీరి వెంట ఏ ఎస్ ఓ రామకృష్ణ చీఫ్ సూపరింటెండెంట్ రామ్ ధన్, డిపార్ట్మెంటల్ అధికారి సతీష్ పరీక్షల సహాయకులు కుసుమ కృష్ణమోహన్, సిట్టింగ్స్ పాడ్ రంగు అనూష ఉన్నారు






