ఇంగ్లీష్  రాయడం చదవడం రావడం లేదని పిల్లల్ని కొట్టిన టీచర్

ఇంగ్లీష్  రాయడం చదవడం రావడం లేదని పిల్లల్ని కొట్టిన టీచర్..?

– ములుగు జిల్లా టేకులపేటలో దారుణం..!

– టేకులపేట ప్రైమరీ స్కూల్లో ఘటన

– టీచర్ పై చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్

ములుగు, తెలంగాణ జ్యోతి : వాజేడు మండల కేంద్రంలోని టేకులపేట గ్రామంలో తెలంగాణ డిపార్ట్మెంట్ ఐటిడిఏ ఏటూరునాగారం అనుబంధంగా ఇంగ్లీష్ మీడియంలో పిల్లల కు మెలకువలు ఇంగ్లీష్ పై ఇష్టాన్ని పెంచడం కోసం ప్రైమరీ పాఠశాల నిర్వహిస్తున్నారు. అందులో అక్షరాలు అభ్యసి స్తున్న వర్షిత్, కుష్మిత, ఆకాంక్ష, రిషిబా, రోహిణి, లాస్య, సిద్దు, దీక్షిత్, విక్రమ్, రిసివర్ధన్, అను విద్యార్థులకు ఇంగ్లీష్ పదాలు రాయడం చదవడం రావడం లేదని ఆగ్రహించిన టీచర్ పిల్లల వంటిపై వాతలు తేలేలా కొట్టడంతో పిల్లలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చూపించారు. పిల్లల్ని వాతలు తేలేల కొట్టిన మేడం పై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకో వాలని తల్లిదండ్రులు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment