Kotagullu | కోటగుళ్ల శిల్ప సంపదను భావితరాలకు అందించాలి
- కరీంనగర్ డిఎంహెచ్ఓ, లలితాదేవి
- భూపాలపల్లి జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ నవీన్ కుమార్
- దుర్గాష్టమి సందర్భంగా కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
భూపాలపల్లి ప్రతినిధి : గణపురంలో కాకతీయులు నిర్మించిన అద్భుత కట్టడాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కరీంనగర్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి రాజేశ్వర్ ప్రసాద్, భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు అన్నారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం డాక్టర్ లలితాదేవి రాజేశ్వర ప్రసాద్, డాక్టర్ సుమతి నవీన్ కుమార్ దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల గోమాతలకు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.