రోడ్డంత బురుదమయం
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండ లంలోని గుర్రెవుల 1వ వార్డు లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా బురద మయంగా మారింది. స్థానికంగా ఉండే ప్రజలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉండే కొన్ని కుటుంబాలు దాదాపుగా 50 కి పైగా పశువులను పెంచుకుంటున్నారు. ఇవి రోజు ఉదయం సాయంత్రం వచ్చిపోయే సమయాలలో ఇంకా ఎక్కువగా రోడ్డంతా బురదగా మారిపోతుంది. అంతేకాక వారంతా ఆ పశువులను రోడ్లపై అడ్డంగా వదిలేస్తూ, స్థానిక ప్రజలు నడిచే రోడ్లను అపరిశుభ్రం చేస్తున్నారు. పశువుల యజమానులకు గతంలో గ్రామపంచాయతీ అధికారులు, స్థానిక ప్రజలు ఎంత తెలియజేసిన వారిలో చలనం లేదు. గత పది రోజులుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న నాథుడే లేడు. ఈ రోడ్డు గుర్రెవుల గ్రామపంచాయతీకి అలాగే బూపతి పురం వెళ్లే దారిలో ఉంటుంది. ఇప్పుడు రోడ్డుపై పేరుకు పోయిన బురదని ఎవరు తీసివేస్తారో, ఎవరికీ ఫిర్యాదు చేయాలో కూడా అర్థం కాని అయోమయంలో స్థానిక ప్రజలు ఉన్నారు. బురద మయం అయిన ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.