జగన్నాధపురం వాడబలిజ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామంలో వాడబలిజ సేవా సంఘం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, వాజేడు మండల వాడ బలిజ సంఘం అధ్యక్షులు గార నాగార్జున రావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. జగన్నాధపురం గ్రామ అధ్యక్షులుగా రోడ్డ అశోక్, కార్యదర్శి, కుప్ప సురేష్, కోశాధి కారి గా సుగంధపు లీలా ప్రసాద్, సలహాదారులుగా బద్ది శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్గా పానెం మూర్తి, అధికార ప్రతినిధిగా బొల్లె కామేష్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రోడ్డ డ్యాని లతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా హర్షద్వా నాల మధ్య ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వాడబలిజ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ ,రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య , రాష్ట్ర యువ నాయకులు కొప్పుల రఘుపతి, ములుగు జిల్లా ముఖ్య సలహాదారు బద్ది ఆదినారాయణ, మండల అధ్యక్షులు గార నాగార్జున్, ఉపాధ్యక్షులు సుగంధపు సాంబశివరావు, వాజేడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుల్లి ఆదినారాయణ, పేరూరు గ్రామ కమిటీ అధ్యక్షులు తునూరి సంటి, మండల ముఖ్య సలహాదారు గారపు కోటేశ్వరరావు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.