జిల్లాలోని మూడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల

On: December 15, 2025 8:24 AM

జిల్లాలోని మూడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల

జిల్లాలోని మూడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల

ములుగు జిల్లా – రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

ములుగు, డిసెంబర్ 14, తెలంగాణ జ్యోతి : మల్లంపల్లి , ములుగు,  వెంకటాపూర్ మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు వెలువడ్డాయి. మూడు మండలాల్లో కలిపి మొత్తం 52 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, వాటిలో 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా రెండు గ్రామ పంచాయతీల్లో (మల్లంపల్లి, వెంకటాపూర్) ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తం ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 34 స్థానాలు గెలుచుకుని ఆధిక్యం సాధించగా, బీఆర్ఎస్ 14, స్వతంత్రులు 2 స్థానాలు దక్కించుకున్నారు.

మల్లంపల్లి మండలంలో మొత్తం 10 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా, 4 ఏకగ్రీవం అయ్యాయి. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2 స్థానాలు సాధించింది. మల్లంపల్లి ల్యాద శ్యామ్ రావు (కాంగ్రెస్), భూపాల్నగర్ (పందికుంట)లో నాగిడి రమణారెడ్డి (కాంగ్రెస్), దేవనగర్‌లో సలువ సంతోష్ (కాంగ్రెస్ – ఏకగ్రీవం), గుర్తూర్ తండాలో బానోతు రాజునాయక్ (కాంగ్రెస్ – ఏకగ్రీవం), కొడిశెలకుంటలో వంచ అనిత (కాంగ్రెస్ – ఏకగ్రీవం), మహ్మద్గౌస్పల్లిలో పసుల కార్తీక్ (బీఆర్ఎస్), ముద్దునూరు తండాలో భూక్య వనిత రాజేందర్ (కాంగ్రెస్ – ఏకగ్రీవం), రాంచంద్రాపూర్‌లో దొంతి స్వరూప ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్), శివతండాలో ధారావత్ భాస్కర్ (కాంగ్రెస్), శ్రీనగర్‌లో ఆకుల మల్లేష్ (బీఆర్ఎస్) గెలుపొందారు.

ములుగు మండలంలో మొత్తం 19 సర్పంచ్ స్థానాలు ఉండగా, వాటిలో 6 ఏకగ్రీవం అయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అబ్బాపూర్‌లో తప్పెట్ల రాజేందర్ (బీఆర్ఎస్), అంకన్నగూడెంలో కొట్టెం రాజు (కాంగ్రెస్ – ఏకగ్రీవం), బంజరుపల్లిలో కంచం రఘు (కాంగ్రెస్ – ఏకగ్రీవం), బరిగలానిపల్లిలో వీరవేని రాజేందర్ (బీఆర్ఎస్), దేవగిరిపట్నంలో ఇస్లావత్ పూలమ్మ (కాంగ్రెస్), ఇంచర్లలో ముస్నిపల్లి కుమార్గౌడ్ (కాంగ్రెస్), జగ్గన్నపేటలో అర్రెం వెంకన్న (కాంగ్రెస్ – ఏకగ్రీవం), జాకారంలో దాసరి సమత రమేష్ (బీఆర్ఎస్), జంగాలపల్లిలో ముడుతనపల్లి మోహన్ (బీఆర్ఎస్), కన్నాయిగూడెంలో అజ్మీర శారద (స్వతంత్ర), కాశిందేవిపేటలో వాంకుడోతు నిరోష అమర్ సింగ్ (బీఆర్ఎస్), కొత్తూరులో గట్టి సుదర్శన్ (కాంగ్రెస్ – ఏకగ్రీవం), మదనపల్లిలో నేత కరుణ సాగర్ (కాంగ్రెస్), పంచోత్కులపల్లిలో గట్టి సింధూజ శ్రీకాంత్ (కాంగ్రెస్), పత్తిపల్లిలో ధారావత్ సరిత సారయ్య (కాంగ్రెస్), పెగడపల్లిలో గొల్ల కుమార్ (కాంగ్రెస్ – ఏకగ్రీవం), పొట్లాపూర్‌లో కందికొండ భాగ్యలక్ష్మీ రమేష్ (కాంగ్రెస్), రాయినిగూడెంలో ఈసం సునీత (కాంగ్రెస్ – ఏకగ్రీవం), సర్వాపూర్‌లో ఈక కుమార్ (కాంగ్రెస్) గెలిచారు.

వెంకటాపూర్ మండలంలో మొత్తం 23 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా, 5 ఏకగ్రీవం అయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ ఫలితం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 7, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అడవిరంగాపూర్‌లో దొంతరబోయిన లక్ష్మీ (కాంగ్రెస్ – ఏకగ్రీవం), బూర్గుపేటలో సేద మల్లక్క సారంగం (కాంగ్రెస్), చక్రవర్తిపల్లిలో భూక్య రఘు (బీఆర్ఎస్), ఇంచించెర్వుపల్లిలో సబావట్ ఈస్రానాయక్ (కాంగ్రెస్), జవహర్‌నగర్‌లో బానోతు జైల్సింగ్ (కాంగ్రెస్), కేశవాపూర్‌లో తోట భద్రయ్య (కాంగ్రెస్ – ఏకగ్రీవం), లక్ష్మీదేవిపేటలో బొమ్మకంటి వంశావతి రమేష్ (కాంగ్రెస్), లక్ష్మీపురంలో గుండ్ల సరిత రమేష్ (బీఆర్ఎస్), లింగాపూర్‌లో రేగూరి శ్రీలత (స్వతంత్ర), మల్లయ్యపల్లిలో జాటోతు గణేష్ (బీఆర్ఎస్), నల్లగుంటలో భూక్య శ్రీదేవి (కాంగ్రెస్), నారాయణగిరిపల్లిలో అన్నెబోయిన శ్రీను (కాంగ్రెస్), నర్సాపూర్‌లో గై రుద్రమదేవి (బీఆర్ఎస్), నర్సింగాపూర్‌లో మేడిపెల్లి రాజేశ్వరి (కాంగ్రెస్ – ఏకగ్రీవం), పాలంపేటలో చల్లగొండ రాజు (బీఆర్ఎస్), పాపయ్యపల్లిలో సూడి సుకేందర్ రెడ్డి (కాంగ్రెస్ – ఏకగ్రీవం), రాజేశ్వర్‌రావుపల్లిలో గూడూరు ప్రశాంత్ (బీఆర్ఎస్), రామాంజపూర్‌లో పెండెల అశోక్ (కాంగ్రెస్), సింగరగుంటపల్లిలో లెంకల ఉష (కాంగ్రెస్), తిమ్మాపూర్‌లో మామిడి పవన్ (కాంగ్రెస్ – ఏకగ్రీవం), వెళ్తుర్లపల్లిలో బొజ్జ శారద (బీఆర్ఎస్), ఎల్లారెడ్డిపల్లిలో బాషబోయిన పోషాలు (కాంగ్రెస్) గెలుపొందారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!