జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
– డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం
వాజేడు, తెలంగాణ జ్యోతి : వాజేడు మండలంలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఐజేయు మండల అధ్యక్షులు కావిరి నరసింహ రావు ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ రాహుల్ చంద్ర వర్మ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కావిరి నరసింహ రావు మాట్లా డుతూ నిత్యం ప్రజల కోసం ఆరాటపడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వానికి ప్రభుత్వాధికారులకు ప్రజలకు వారధిగా నిలుస్తున్న వర్కింగ్ జర్నలిస్టు సమస్య లైనటువంటి అక్రిడేషన్, హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాలు, బస్ పాస్ వంటి సమస్యలు పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను ఏ మాత్రం పట్టించుకోలేదని నిరం తరం ప్రజాసేవలో ఉంటున్న మాకు ఇప్పుడు కొలువుదీరిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలన్నారు. స్పందించిన డిప్యూటీ తాసిల్దార్ రాహుల్ చంద్ర వర్మ మాట్లాడుతూ మీ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వపరంగా మేము చేయవలసిన పని తప్పకుండా చేస్తామని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీకు అన్ని వసతులు ఉంటాయన్నారు. ప్రజా సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని మీ శ్రమకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్య క్రమంలో కవిరి నరసింహారావు, చెన్నం సరబాబు, బొల్లె వెంకటేశ్వర్లు, కోర్స యుగంధర్, పట్టం రామ్మూర్తి, మనోజ్, రేపాకుల శివ, ఉదయ్, భాస్కర్, శోభన్, గుడివాడ గణేష్, లతోపాటు. తదితరులు పాల్గొన్నారు