సీతక్కకు వినతిపత్రం అందజేసిన మైనారిటీస్ పెద్దలు
ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లిలోని కబరస్తాన్లో ఈద్గా కాంపౌండ్ వాల్, సిసి రోడ్ నిర్మాణం కోసం మైనారిటీ పెద్దలు మహమ్మద్ మైబు, మహమ్మద్ అబ్దుల్ గపూర్ లు సీతక్క కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై సీతక్క సానుకూలంగా స్పందిం చి త్వరలో కావాల్సిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సభ్యులు మహమ్మద్ నాజర్, జలీల్, ఘనిబ్, ఇబ్రహీం, అజారుద్దీన్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.