విధుల సమయంలో మండల విద్య వనరుల కేంద్రం మూసివేత
కన్నాయిగూడెం, డిసెంబర్ 27, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలో ఉన్న మండల విద్య వనరుల కేంద్రం విధుల సమయంలో మూసి వుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలల సంబంధించిన పరిపాలనా పనులు, సర్టిఫికెట్లు, విద్యా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కోసం కార్యాలయానికి వచ్చిన వారు సిబ్బంది లేక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. పని వేళల్లో కార్యాలయం మూసివుండటం వల్ల ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్టుగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు కార్యాలయాలు విధి సమయాల్లో అందుబాటులో ఉండాల్సిందేనని, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమయపాలన పాటించని అధికారులు
మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రం విధుల సమయంలో కూడా మూసివుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు గంటల తరబడి ఎదురుచూసి చివరకు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. పని వేళల్లో మధ్యాహ్నం 1 గంట దాటినా కార్యాలయం తెరవకపోవడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన విద్యా సంబంధిత కార్యాలయాల్లో ఇలా నిర్లక్ష్యం కొనసాగడం సరైనది కాదని, సమయపాలన పాటించని అధికారులపై ఉన్నతాధి కారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





