మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలు

On: January 21, 2026 12:59 PM

మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలు

మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలు

– సమ్మక్క, సారలమ్మ ఆలయాల శుద్ధి

– గ్రామ దేవతలకు పూజారుల మొక్కలు 

– సమ్మక్క సారలమ్మ గుడుల వద్ద తోరణాలతో అలంకరణ

– రాత్రి అంతా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజారుల జాగారాలు

ములుగు ప్రతినిధి, జనవరి 21, తెలంగాణ జ్యోతి : ఆసియా ఖండం లోనే  అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన  మేడారం మహా జాతరకు అంకురార్పణలో ప్రధాన ఘట్టం మండమెలిగే మండ మెలిగే పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. మహా జాతరకు సరిగ్గా వారం ముందు ఆలయ పూజారులు ఈ పండుగను నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది. మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడులను వేకువజామునే పూజారులు ఆలయాలను పుట్టమట్టితో గుడులు అలికి… మామిడి తోరణాలతో పూజారులు అలంకరణ చేశారు. మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, గిరిజన ఆడపడుచులు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు, గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహించి బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు.

మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలుఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ చేస్తారు. ఇవాళ రాత్రి గద్దెల చెంత పూజలు చేసి తల్లులకు నైవేద్యాలు సమర్పించి రేపు ఉదయం వరకు పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో రాత్రి కొంత సమయం వనదేవతల దర్శనాలు నిలిచిపోనున్నాయి. 28 నుండి 31 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అసలు జాతర ప్రారంభం కానుంది. మొదటి రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఇక రెండో రోజు చిలకలగుట్ట దిగి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ వేడుకలు

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!