వైభవంగా అయ్యప్పస్వామి ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన 

వైభవంగా అయ్యప్పస్వామి ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన 

వైభవంగా అయ్యప్పస్వామి ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపన 

– సహస్ర కలిశాభి పూజలు,అన్న సంతర్పణ, పూజల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు,సహకార దాతలు

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రం లోని హరిహరసుత అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్ర మాన్ని అర్చకులు శేషు, కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహిం చారు. ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు,  దేవతల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం గోపురం పై కలిశాలతో వేద మంత్రోచ్చారణ మధ్య స్వాములతో, దాతలతో అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహం పై అభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు  దర్శనాన్ని కల్పిం చారు.అనంతరం విచ్చేసిన వివిధ మండలాల భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రాత్రి పడిపూజా కార్యక్రమం నిర్వహించి పద్దెనిమిది మెట్లు గుండా ఇరుముడితో స్వాములను ఎక్కించి దర్శనం కల్పించారు. ఆల్ఫాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ అనుముల శ్రీని వాస్, ఎసై తాజోద్దీన్, మంగపేట ఎసై సూరి, తాడ్వాయి ఎసై శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పి చైర్ పర్సన్ నాగజ్యోతి, మంత్రి సీతక్క తనయుడు కుంజ సూర్య, బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంధాలయం సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, గ్రామంలోని వివిధ ఆలయాల చైర్మన్ లు ప్రభాకర్, శ్రీనివాస్, ప్రసాద్ అయ్యప్ప స్వాములు, అంజన్న స్వాములు తదితరులు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment