ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి

ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి

ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి

– డ్రైవింగ్ చేసేటప్పుడు కుటుంబం భవిష్యత్ గురించి ఆలోచించాలి.

– ప్రమాదాల గురి కాకుండా రక్షణ కల్పించుకోవాలి.

– ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఐపిఎస్.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి: రోడ్డు  ప్రమాదా ల్లో మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, సరైన అవగాహన లేక చిన్న పొరపాట్లతో గాయాల పాలై ప్రాణాలు కోల్పోయివారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమానికి ఏ ఎస్పి శివం ఉపాధ్యాయ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహనతో డ్రైవింగ్ చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడప రాదని, మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదన్నారు. అతి వేగం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. పలు రోడ్ భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే వారి కుటుంబం బరువు బాధ్యతలు ఎవరు చూసుకుంటారని, అందుకే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా హెల్మెట్ యొక్క ప్రాధాన్య తను, ప్రమాదాల జరిగినప్పుడు మెదడుకు దెబ్బ తగలకుండా ప్రాణ రక్షణ కల్పించుకుంటున్నారని సూచించారు. ఈ సందర్భం గా ద్విచక్ర వాహనదారులకు వార్త దినపత్రిక 29వ వార్షికోత్సవం సందర్భంగా  హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే పోలీస్ శాఖ తరపున కూడా హెల్మెట్లను వాహనదారులకు పంపిణీ చేశారు. వాహనదారులు వెంకటాపురం గెస్ట్ హౌస్ నుండి శివాలయం, ఎంపీడీవో ఆఫీస్ మీదుగా గెస్ట్ హౌస్ వరకు భారీ ఏఎస్పీ ఉపాధ్యాయ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు, వార్త దినపత్రిక ములుగు జిల్లా మండల రిపోర్టర్లు, వార్త బ్యూరో, వార్త ములుగు జిల్లా క్రైమ్ రిపోర్టర్ లు సమావేశంలో పాల్గోన్నారు. ద్విచక్ర వాహనదారులు కూడ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment