రుణమాఫీ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : రైతులను రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని కాటారం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ జోడు శ్రీనివాస్ ఆరోపించారు. మంగళ వారం కాటారంలో ఏర్పాటు చేసిన జోడు శ్రీనివాస్ మాట్లాడు తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం రుణమాఫీ చేసినట్లు చెబుతూ రైతులను మోసం చేస్తుందని అన్నారు. నాలుగో విడత దాదాపు 3 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని రైతుల పేర్లతో సహా లిస్టులు పంపించి పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు రాయించుకొని ప్రచారం చేసుకున్నా రని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చెయ్యకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. రైతులు రుణమాఫీ అయిందేమో అనుకొని బ్యాంకులో చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీకి సంబంధించిన డబ్బులను వెంటనే వారి అకౌంట్లో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మండల పార్టీ బిఆర్ఎస్ ఇంచార్జ్ జోడు శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ రామిళ్ళ కిరణ్, నరివెద్ది శ్రీనివాస్, జక్కు శ్రావణ్ కుమార్ లు పాల్గొన్నారు.