ములుగు మున్సిపాలిటీ పరిధిలో తుది ఓటర్ జాబితా విడుదల
ములుగు, జనవరి 12, తెలంగాణ జ్యోతి: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించిన తుది ఫోటో ఓటర్ జాబితాను కమిషనర్ జై సంపత్ విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 13,963 మంది ఉండగా పురుషులు 6,661 మంది, స్త్రీలు 7,300 మంది, ఇతరులు 2 మందిగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ తుది ఓటర్ జాబితాను ములుగు పురపాలక సంఘ కార్యాలయంలో ప్రచురించగా, ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు.
ములుగు మున్సిపాలిటీ – వార్డు వారీ తుది ఓటర్ జాబితా
ములుగు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13,963 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 6,661 మంది పురుషులు, 7,300 మంది మహిళలు, 2 మంది ఇతరులు ఉన్నారు.
| వార్డు | పురుషులు | స్త్రీలు | ఇతరులు | మొత్తం |
|---|---|---|---|---|
| 1 | 321 | 350 | 0 | 671 |
| 2 | 333 | 404 | 1 | 738 |
| 3 | 342 | 410 | 0 | 752 |
| 4 | 380 | 393 | 0 | 773 |
| 5 | 299 | 355 | 0 | 654 |
| 6 | 315 | 312 | 0 | 627 |
| 7 | 371 | 364 | 0 | 735 |
| 8 | 355 | 342 | 0 | 697 |
| 9 | 329 | 366 | 0 | 695 |
| 10 | 350 | 395 | 1 | 746 |
| 11 | 344 | 367 | 0 | 711 |
| 12 | 381 | 409 | 0 | 790 |
| 13 | 326 | 362 | 0 | 688 |
| 14 | 354 | 402 | 0 | 756 |
| 15 | 380 | 379 | 0 | 759 |
| 16 | 291 | 325 | 0 | 616 |
| 17 | 312 | 317 | 0 | 629 |
| 18 | 293 | 345 | 0 | 638 |
| 19 | 277 | 337 | 0 | 614 |
| 20 | 308 | 366 | 0 | 674 |
| మొత్తం | 6,661 | 7,300 | 2 | 13,963 |






