మేడారం అభివృద్ధి తట్టుకోలేకే మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు 

On: January 8, 2026 6:42 PM

మేడారం అభివృద్ధి తట్టుకోలేకే మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు 

మేడారం అభివృద్ధి తట్టుకోలేకే మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు 

బిఆర్ ఎస్ పింక్ సోషల్ మీడియాపై మండిపాటు

కన్నాయిగూడెం, జనవరి 8,  తెలంగాణ జ్యోతి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే బిఆర్ ఎస్ పింక్ సోషల్ మీడియా మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కన్వీనర్ సునార్కని సాంబశివ తీవ్రంగా విమర్శించారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క జాతరకు ఎక్కువ నిధులు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా స్పందన లేకపోయిందని, అప్పట్లో జాతర సమయంలో ఇసుక లారీలు నడవడంతో భక్తుల వాహనాలకు ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క ఒక ఆదివాసీ బిడ్డగా మేడారం జాతరను ప్రపంచ చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుగానే చర్యలు తీసుకుని, జాతర దృష్ట్యా కొన్ని లారీలను మళ్లించడంతో పాటు 15 రోజులపాటు పూర్తిగా ఇసుక లారీ రాకపోకలను నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ విషయాలను వక్రీకరిస్తూ కొందరు బిఆర్ ఎస్ చిల్లర బ్యాచ్, పెయిడ్ యూట్యూబ్ ఛానెల్స్, పింక్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఇకనైనా రాజకీయ లబ్ధి కోసం దిగజారి మంత్రి సీతక్కపై లేనిపోని ఆరోపణలు మానుకుని, మేడారం జాతర అభివృద్ధిపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలకు తక్షణమే ముగింపు పలకాలని సాంబశివ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!