మరో మార్కెట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు : మంత్రి సీతక్క
– బండారుపల్లి దారిలో నూతన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన
ములుగు, డిసెంబర్ 24, తెలంగాణ జ్యోతి : ములుగులో ప్రస్తుతం ఉన్న మార్కెట్ తోపాటు మరో మార్కెట్ ఏర్పాటు చేయడంతో ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ములుగు లోని బండారుపల్లి దారిలో గల ఆర్అండ్బీ కార్యాలయ ప్రాంగణంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ కోసం రూ.1.50కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్కెట్ కోసం స్థలాన్ని కేటాయించినందుకు కలెక్టర్ కు కృతజ్క్షతలు తెలిపిన మంత్రి రాబోయే రోజుల్లో ములుగు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) సంపత్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







