కాటారంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన డీఎస్పీ
కాటారం,డిసెంబర్30,తెలంగాణజ్యోతి:మండల కేంద్రంలోని చింతకానిక్ క్రాస్ సమీపంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమలలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అండర్–16, 18, 20 విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను జనవరి 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహ కులు తెలిపారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమం లో అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, సెక్రటరీ పూతల సమ్మయ్య, స్పాన్సర్ బాలాజీ షాపింగ్ మాల్ యజమాని కుమార్, మంథని నియోజకవర్గ నాయకులు చీమల సందీప్, కడారి విక్రమ్, ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, ఉపాధ్యక్షులు అజయ్, సాంబమూర్తి, సారంగపాణి, రాజు, పీఈటీలు రఘువీర్, లక్ష్మణ్, పూర్ణిమ, విజయలక్ష్మి, గౌతమి, రవికుమార్, రమేష్, చందు, జితేందర్, వీరన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.






