మేడారం జాతర ఆర్టీసీ చార్జీల వివరాలు ఖరారు

On: January 17, 2026 1:25 PM

మేడారం జాతర ఆర్టీసీ చార్జీల వివరాలు ఖరారు

మేడారం జాతర ఆర్టీసీ చార్జీల వివరాలు ఖరారు

ములుగు, జనవరి 17(తెలంగాణజ్యోతి): మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) 2026 సంవత్సరానికి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్ చార్జీలను ఖరారు చేసింది. వివిధ జిల్లాలు, పట్టణాల నుంచి మేడారం వరకు దూరాన్ని ఆధారంగా చేసుకుని ఈ చార్జీలను నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జాతర కాలంలో ఇవే చార్జీలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ విడుదల చేసిన వివరాల ప్రకారం గోదావరిఖని నుంచి మేడారం వరకు ₹400, హుస్నాబాద్ ₹350, హుజురాబాద్ ₹320, కరీంనగర్ ₹390, పెద్దపల్లి ₹420, మంథని ₹350, 8-ఇంక్లైన్ ₹400గా ఎక్స్‌ప్రెస్ బస్ చార్జీలు ఖరారయ్యాయి. అలాగే ఇల్లందు నుంచి ₹400, ఇల్లందు–గుండాల మార్గం ద్వారా ₹270, కొత్తగూడెం నుంచి ₹350, భద్రాచలం నుంచి ₹300, మణుగూరు నుంచి ₹210గా నిర్ణయించారు. ఏటూరునాగారం నుంచి మేడారం వరకు కేవలం ₹80 మాత్రమే చార్జీ ఉండగా, మంగపేట ₹110, పాల్వంచ ₹310, ఖమ్మం ₹480, కాలేశ్వరం ₹360, సిరొంచ (మహారాష్ట్ర) నుంచి ₹400గా నిర్ణయించారు. కాటారం నుంచి ₹290, ఆసిఫాబాద్ నుంచి ₹590, బెల్లంపల్లి ₹520, చెన్నూర్ ₹450, మందమర్రి ₹470, మంచిర్యాల ₹440, శ్రీరాంపూర్ ₹430గా చార్జీలు ఉన్నాయి. ఇక నార్లాపూర్/చింతల్ నుంచి ₹40, చెర్ల (ఏటూరునాగారం మార్గం) నుంచి ₹250, వెంకటాపూర్ ₹150, వాజేడు ₹120, పెరూరు ₹160గా ఎక్స్‌ప్రెస్ బస్ టికెట్ ధరలను ఖరారు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు అవసరాన్ని బట్టి అదనపు బస్సులు కూడా నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. భక్తులు ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు చేసుకుని ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

మేడారం జాతర ఆర్టీసీ చార్జీల వివరాలు ఖరారు

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!