కనుమ పండుగలో కనుమరుగవుతున్న గంగిరెద్దులు
ఆధునిక జీవనశైలి ప్రభావంతో ఆసక్తి తగ్గుదల
కన్నాయిగూడెం, జనవరి 16 (తెలంగాణ జ్యోతి): ఒకప్పుడు కనుమ పండుగ అనగానే గంగిరెద్దుల సందడే గ్రామాలకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. రంగురంగుల అలంకరణలతో ఇంటింటా తిరుగుతూ వినోదం పంచిన గంగిరెద్దుల సంప్రదాయం నేడు క్రమంగా కనుమరుగవుతోంది. ఆధునిక జీవనశైలి ప్రభావం, యువతలో ఆసక్తి తగ్గడం, పోషణ–నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ఈ సంప్రదాయం నిలకడ కోల్పోతోందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గ్రామీణ సంస్కృతి, జానపద కళలను కాపాడాలంటే గంగిరెద్దుల కళకు ప్రభుత్వ స్థాయిలోనూ, సమాజం నుంచీ ప్రోత్సాహం అందించాలని కళాకారులు కోరుతున్నారు.






