వెంకటాపురంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
వెంకటాపురం, డిసెంబర్ 28, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటా పురం మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్య సాధన, దేశాభివృద్ధిలో చేసిన కృషి, పార్టీ ఆశయాలు, లక్ష్యాలపై నాయకులు ప్రసంగించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మన్యం సునీల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టం సాయి, వెంకటాపురం సర్పంచ్ తాటి సరస్వతి, మరికాల సర్పంచ్ కుర్సం కన్నయ్య, సీనియర్ నాయకులు మద్దుకూరి ప్రసాద్, సీతాదేవి, వి. సత్యనారాయణ, కాల్వ సుందర్రావు, పి. మురళి, రవి, డర్రా రవి, గుండమల్ల కిరణ్, ఉప్పల హరి, డి. నాగరాజు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






