కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం
అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు.
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
సీనియర్ కాంగ్రెస్ నాయకులుచిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్
వెంకటాపురం నూగూరు, జనవరి 19 (తెలంగాణ జ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంజూరు చేసి మారుమూల ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పనిచేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ అన్నారు. సోమవారం వెంకటాపురం మండల కేంద్రం శివారు బీసీ మర్రిగూడెం పంచాయతీలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి వారు హాజరై, లబ్ధిదారుడు మోటం రాజేష్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లబ్ధిదారుడు మోటం రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని, ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్ సర్వీసు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలకు భరోసా కల్పించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ మర్రిగూడెం సర్పంచ్ సురిటి రాజేశ్వరి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలసాని వేణు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టం సాయి, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాముల రమేష్, నాయకులు గుండమల్ల కిరణ్, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






