బాలుడికి తీవ్ర గాయాలు.. గాంధీ ఆసుపత్రికి తరలింపు…
– ఆస్పత్రికి వెళ్లేందుకు సాయం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరంలో మంగళవారం వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలి దుమారం, బల మైన గాలులు వీయడంతో ప్రమాదవశాత్తుగా ఎండి సాబీర్ తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే మహదేవ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. నిరుపేదలైన బాలుడి తల్లి దండ్రులకు రవాణా ఖర్చులు లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు దుద్దిల్ల శ్రీను బాబులకు తెలియజేయగా మంగళవారం అర్ధరాత్రి బాధితులను పరామర్శించి వారు ప్రయాణ ఖర్చు లను అనుచరుల ద్వారా అందించారు. హాస్పిటల్ సూపరిం టెండెంట్ తో మాట్లాడి వెంటనే ఆపరేషన్ చేయాలని మెడికల్ పీఏ మహేందర్ యాదవ్ ద్వారా పర్యవేక్షించారు. ఆపద కాలంలో బాలుడి కుటుంబ సభ్యులను ఆదుకున్నం దుకు తల్లిదండ్రులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేంగానే అశోక్ ఉన్నారు.
1 thought on “బాలుడికి తీవ్ర గాయాలు.. గాంధీ ఆసుపత్రికి తరలింపు…”