అంగరంగ వైభవంగా తెప్పోత్సవ కార్యక్రమం
– తరలివచ్చిన భక్తజనం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు సోమవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం స్వామి వారిని ఊరేగింపుగా సన్నాయి మేళాలు మధ్య వేద పండితుల మంత్రోచ్ఛరనల మధ్య వెంకటాపురానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలెం బల్లకట్టు వాగులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి దొంగల దోపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ,ఆలయకమిటీ ఏర్పాట్లు చేయగా స్వామివారి ఆలయం ప్రాంగణంలో, ప్రధాన రహదారిపై జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.