Telangana  | మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి : సీఎం రేవంత్ రెడ్డి

On: January 7, 2026 3:19 PM

Telangana  | మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి : సీఎం రేవంత్ రెడ్డి

Telangana  | మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి : సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 8న జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్, జనవరి 07 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం. మార్చిలో వార్షిక పరీక్షలు ఉండటంతో ఆలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందే షెడ్యూల్ విడుదల చేసి, ఫిబ్రవరిలో ఒకే విడుతలో పోలింగ్ నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం మంత్రులకు సూచించినట్టు తెలిసింది. ఈ నెల 8న జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం తన చాంబర్‌లో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు తో సుమారు అరగంట పాటు చర్చించారు.

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా, సమర్థులకే టికెట్లు ఇవ్వాలని సీఎం సూచించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని, డిసిసి అధ్యక్షులు తమ పూర్తి స్థాయి కార్యవర్గ జాబితాలను ఈ నెల 8న పీసీసీకి అందించాలని ఆదేశించినట్టు తెలిసింది.

అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు, కృష్ణా జలాల పంపిణీ, హిల్ట్ పాలసీపై జరిగిన చర్చల్లో మంత్రులు సమర్థంగా వ్యవహరించారని సీఎం అభినందిం చినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ వ్యూహాలను 8వ తేదీ సమావేశంలో ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!