Telangana : తెలంగాణ అధికారిక చిహ్నం పై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు
హైదరాబాద్, మే 27 : తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి, ఈరోజు చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీ లించిన సీఎం.. తుది నమూనాపై కీలక సూచ నలు చేశారు. గత చిహ్నం లో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తు న్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్నే.. జూన్ 2న ఆవిష్కరించనున్నారు. త్వరలో తుది చిహ్నం సిద్ధం కానుందని.. కాగా ఇప్పటికే రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణకు మెరుగులు దిద్దేందు కు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆ పాటను అప్పగించారు.