టోల్ ఫ్రీ నెంబర్ 1097 ను సద్వినియోగం చేసుకోండి
– మహాదేవపూర్ ఐసిటిసి కౌన్సిలర్ గాదే రమేష్ పిలుపు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఆరోగ్య సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1097 ను సద్వినియోగం చేసుకోవాలని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మంతెన మౌనిక, మహాదేవపూర్ ఐసిటిసి కౌన్సిలర్ గాదె రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మద్దులపల్లి, కాటారం, గంట గూడెం గ్రామాల్లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కార్యక్రమాలను కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మంతెన మౌనిక ఆధ్వర్యం లో నిర్వహించారు ప్రజలకు రోగాల పట్ల అవగాహన పెంచడంతో పాటు వారికి కావలసిన వైద్య సదుపాయాలను చికిత్సలను అందిస్తున్నామని కాటారం ప్రాథమిక వైద్యాధి కారిని డాక్టర్ మంతెన మౌనిక అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరోగ్య శిబిరాలలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్సలు మందు గుళికలు అందించారు. డ్రై డే కార్యక్రమాలను నిర్వహించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. చిన్న పిల్లలకు, సీజనల్ వ్యాధులకు సంబంధించిన విషయాలను సోదాహరణంగా వివరించారు. గర్భిణీలకు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఐసిటిసి కౌన్సిలర్ గాద రమేష్ వివరించారు. ఈ శిబిరాలలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్లు ప్రియాంక, గీత, సిహెచ్ఓ నిర్మల, పీహెచ్ఎన్ అన్నపూర్ణ, ఏఎన్ఎంలు నాగరాణి, సునీత, శ్యామల, హెల్త్ అసిస్టెంట్ లు కాపర్తి రాజు, సమ్మయ్య, ఆశా కార్యకర్తలు పార్వతి, కవిత, సునీత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.