కాంగ్రెస్ పార్టీకి స్వర్గీయ చింతా సమ్మయ్య చేసిన సేవలు మరువరానివి
– ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్వర్గీయ. చింతా సమ్మయ్య దిశ దిన కర్మ కాండలకు బుదవారం భద్రా చలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయి నివాళుల ర్పించారు. స్వర్గీయ చింతా సమ్మయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువరానివని, ప్రజాప్రతినిధిగా, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల మనిషిగా గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే సంతాపం తెలుపారు.ఈ కార్యక్రమంలో వాజేడు, వెంక టాపురం మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.