బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా సూర్యదేవర విశ్వనాథ్

Written by telangana jyothi

Published on:

బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా సూర్యదేవర విశ్వనాథ్

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో బిజెపి జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ములుగు జిల్లా అధికార ప్రతినిధిగా సూర్యదేవర విశ్వనాధ్ ను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం తెలిపారు. ఆదివారం రాయల్ ప్లాజా లో జరిగిన బిజెపి కార్య కర్తల సమావేశంలో జిల్లాలోని సభ్యత్వ నమోదు కార్యక్రమం పై చర్చ కొనసాగింది. హిందుత్వవాదిగా, హిందూ సంరక్షణ సమాజ సేవా కార్యక్రమాలను ఎన్నో నిర్వహించి బిజెపిలో చురుకుగా పాల్గొంటున్న సూర్యదేవర విశ్వనాథ్ కు జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నుకున్నారు. సూర్యదేవర విశ్వనాథ్ బాల్యం నుండి స్వయం సేవక్ గా, విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏవీపీ విద్యార్థి నాయకునిగా పనిచేస్తూ, రాష్ట్ర నాయకత్వంలో పనిచేసిన అనంతరం భారతీయ జనతా పార్టీలో ములుగు పట్టణ ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు బాద్యతలు నిర్వహించా డు.మండల ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి భూపాలపల్లి ములుగు జిల్లా కార్యదర్శిగా, వెంకటాపూర్ మండల ఇన్చార్జి గా, వివిధ బాధ్యతలు చేపట్టి పార్టీకి చేసిన కృషిని గుర్తించి ములుగు జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు బాధ్యత ఇచ్చినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి నాకు ఈ బాధ్యత అప్పగించడం ఆనందంగా ఉందని, బిజెపి పార్టీ అభివృద్ధికి మరింత దోహదపడే విధంగా చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ అభివృద్ధికి తోడ్పడుతానని విశ్వనాథ్ అన్నారు. పార్టీ నా సేవలను గుర్తించి నాకు ఈ బాధ్యత ఇచ్చిన జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, జిల్లా ప్రధాన కార్యదర్శిలు, బిజెపి మరియు మోర్చా నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు. రానున్న రోజులలో పార్టీ పటిష్టతకు కృషిచేసి ఎన్నిక ల్లో గెలిపి లక్ష్యంగా పనిచేస్తామని విశ్వానాధ్ తెలిపారు.

Leave a comment