రాష్ర్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సర్వేయర్లు  

రాష్ర్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సర్వేయర్లు  

రాష్ర్ట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సర్వేయర్లు  

ములుగు, తెలంగాణ జ్యోతి : భూ భారతి చట్టంలో లైసెన్సుడ్ సర్వేయర్ లకు గుర్తింపు, ఉపాధి కల్పించినందకు హర్షిస్తూ రాష్ర్ట ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ములుగు జిల్లా లాండ్ రికార్డ్స్ లైసెన్సుడ్ సర్వేయర్ల అసోసియేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి లాండ్ రికార్డ్స్ లైసెన్సుడ్ సర్వేయర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యతన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్.ఓ.ఆర్, భూభారతి నూతన చట్టంలో రిజిస్ట్రేషన్ కు ముందు మ్యాపు తప్పనిసరి చేసి, భూభారతి చట్టంలో లైసెన్సుడ్ సర్వేయర్స్ కి ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, మాకు అన్నివిధాలుగా సహకరించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సర్వేయర్ల రాష్ర్ట అధ్యక్షుడు వరప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం సతీష్, వెంకన్న, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment