వేసవి క్రీడా శిక్షణా శిబిరం ప్రారంభం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో గారేపల్లి టీచర్స్ కాలనీలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం ప్రారంభించారు. ఖో-ఖో శిక్షకులు కురుసం అశోక్ కుమార్ నిర్వహణలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరం లో పాల్గొంటున్న పిల్లలకు శనివారం నాడు కీ.శే. వావిల్ల సురేందర్ (టీచర్) స్మారకార్థం వారి కుమారుడు వావిల్ల సాగర్ క్రీడాకారులందరికీ సమ రూప క్రీడా దుస్తులు బహుకరణ చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు సందీప్, శ్రీనివాస్, భాస్కర్, ఉపాధ్యా యులు అనిల్, సాంబశివుడు, నాగరాజు, మోహన్ సీనియర్ ఖో ఖో క్రీడాకారులు మంతెన శ్రీనివాస్, సృజన్ పాల్గొన్నారు. ఈ వేసవి శిక్షణా శిబిరం ఈ నెలాఖరు వరకు టీచర్స్ కాలనీ గారెపల్లీ లో నిర్వహించబడుతుందని వివరించారు. 14 సంవత్సరముల లోపు పిల్లలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ది అధికారి సి.ఎచ్.రఘు, ఖో-ఖో శిక్షకులు కురుసం అశోక్ కుమార్ తెలిపారు.