రైతులు ఎవరు అధైర్య పడవద్దు
– ప్యాక్స్ చైర్మన్ సల్ల తిరుపతయ్య
మహాదేవపూర్ /తెలంగాణ జ్యోతి : గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులు ఎవరు అధైర్య పడవద్దని చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మహాదేవపూర్ ప్యాక్స్ చైర్మన్ సల్ల తిరుపతయ్య అన్నారు. శనివారం మండలంలోని మహా దేవపూర్, సూరారం, బెగుళూర్, మరియు ఎలికేశ్వరం గ్రామాల లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఫ్యాక్స్ చైర్మన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలో దాదాపు కొనుగోలు పూర్తయిందని ఇప్పుడు కొనుగోలు పక్రియ చివరి దశలో ఉందన్నారు. కొందరు వ్యక్తులు కావాలని ధాన్యం కొనుగోలుపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజబాబు పాల్గొన్నారు.