విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలి
– కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : వసతి గృహాలలో నివాసం ఉంటున్న విద్యార్థులకు మెరుగైన భోజనాన్ని అందిం చాలని కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్ అన్నారు. శనివారం ఆయన కాటారం తహసిల్దార్ నాగరాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి కాటారం కస్తూర్బా గురుకుల విద్యాల యం, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారంగా భోజనం అందిస్తున్నారా లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్, హాస్టల్ రూమ్ లను, కిచన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, ఆర్వో వాటర్ ప్లాంట్, మైదానం, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనం తరం రికార్డులను తనిఖీ చేశారు. కస్తూర్బా గాంధీ గురుకులం ప్రత్యేక అధికారిణి చల్లసునీత, ప్రిన్సిపాల్, సిబ్బంది ఉన్నారు.