బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలంలోని పలు గ్రామాలలో మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ , పెద్దపెల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ బాధితు లను పరామర్శించి భరోసా కల్పించారు. ఈ మేరకు శనివారం చింతకానిలో అనారోగ్యంతో బాధపడుతున్న సుంకే నాగమణి తల్లిని, ఆతుకూరి వెంకటిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు. అలాగే అరిగెల దుర్గమ్మ, పొట్ట బానయ్య కుమారుడు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆయా కార్యక్రమంలో పుట్ట మధు వెంట బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, తోట జనార్ధన్, పంతకాని సడవలి, కొండగొర్ల వెంకటస్వామి, మందల లక్ష్మారెడ్డి, గాలి సడవలి, గుండ్లపల్లి అశోక్, మానం రాజ బాబు, చందా శ్రీనివాస్, చకినాల ప్రశాంత్, కాటారపు రాజ మౌళి, కొడపర్తి రవి, ఆత్కూరి బాలరాజు, మహేష్, తోట బాపు, సకినాల రాజయ్య తదితరులు ఉన్నారు.