భారత క్రికెట్ జట్టులో ఎంపికైన విద్యార్థులకు సన్మానం
ములుగు, జనవరి9 (తెలంగాణ జ్యోతి): భారత క్రికెట్ జట్టులో ఎంపికైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని ములుగు జిల్లా కేంద్రంలోని వివేకవర్ధిని అండ్ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్‌లలో ఘనంగా నిర్వహించారు. భారత క్రికెట్ రెడ్ టెన్నిస్ బాల్ జట్టుకు ఎంపికైన పాఠశాల విద్యార్థులు గుర్రం ప్రణీత్ రెడ్డి, బానోత్ సుమన్‌లను పాఠశాల యాజమాన్యం చిర్రా నరేష్ గౌడ్, ముద్దం సంతోష్ చక్రవర్తి లు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ భారత జట్టుకు ఎంపికైన విద్యార్థులు ములుగు జిల్లా పేరు, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా గర్వపడేలా నిలబెట్టాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభను చాటుతూ భారతదేశానికి మంచిపేరు తీసుకురావాలని విద్యార్థు లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్.ఎన్. హరి, వ్యాయామ ఉపాధ్యాయులు ఏ. సురేష్, ఎస్. పవన్, ఎల్. రాజు తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.





