ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు ప్రతిభ

On: November 17, 2025 3:45 PM
ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు ప్రతిభ

ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు ప్రతిభ

– మొదటి మూడు బహుమతులు గెలుచుకున్న బ్రిలియంట్ విద్యార్థులు

ములుగు, నవంబర్ 17 (తెలంగాణ జ్యోతి) : ములుగులోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్, వివేకవర్ధిని హై స్కూల్‌లలో ఈనాడు పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ఉపన్యాసం పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మొదటి మూడు స్థానాలను గెలుచుకున్నారు. కె.చక్రిక, పి.అక్షయ, కె.హరిణీలు ఉత్తమ ఉపన్యాసకులు గా గెలుపొందగా వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్​లు చిర్ర నరేష్​ గౌడ్​, ముద్దం సంతోష్​ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రతిభా పాటవ పోటీల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, ఈనాడు ఆధ్వర్యంలో జరగడం సంతోషకరమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రత్యేకమైన రంగాల్లో నిష్ణాతులు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్‌.ఎన్. హరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment