అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు

On: March 31, 2026 6:34 PM

అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు

అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు

స్టాక్ రిజిస్టర్లు తప్పకుండా మెయింటైన్ చేయాలి : తహసీల్దార్

కన్నాయిగూడెం, తెలంగాణజ్యోతి:కన్నాయిగూడెం మండలం ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువుల డీలర్ల సమావేశంలో అధిక ధరలకు ఎరువులు విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు తప్పకుండా మెయిన్టెయిన్ చేయాలని,  ఎరువులను బ్లాక్‌లో అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్వో హెచ్చరించారు. రైతులను మోసం చేసే విధంగా ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని సూచించారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిన లక్ష్మిపురం గ్రామానికి చెందిన డీలర్ యజమాని స్వయంగా హాజరు కాకుండా మరొకరిని పంపడం గమనార్హం కాగా, వ్యవసాయం పట్ల అవగాహన లేదని స్థానికులు ఆరోపించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!