పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు
- ఇంటిపన్ను మీద ఉన్న శ్రద్ధ విద్యుత్ పై లేకపోయే..!
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ఇంటిపన్ను మీద ఉన్న శ్రద్ధ వీధిలైట్లపై ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యంతో ఇష్టారీతిగా పగల నక, రాత్రనక వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. కన్నాయి గూడెం మండలంలోని వెంకట్రావుపల్లి కాలనీలో గత ఇరవై రోజు ల నుంచి విద్యుత్ వీధి దీపాలు పగలనక, రాత్రనక వెలుగు తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి కూడా సరిగా పని చేయని వీధి దీపాలను పట్టించుకోని అధికారులు పగలు కూడా నిరంతరాయంగా వీధి దీపాలు వెలగడం చూసి ప్రజలు అధికా రుల తీరుపై మండిపడుతున్నారు. వెలుగుతున్న వీధి దీపాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.మా కాలనీ లో రాత్రి వేళల్లో విద్యుత్ వీధి దీపాలు సక్రమంగా వెలిగితే చాలు పట్టపగలు అవసరం లేదని, అధికారులు నిర్లక్ష్యం వీడి వీధి దీపాలపై శ్రద్ధ వహించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.