రాష్ట్ర వాడబలిజ సేవాసంఘం నూతన కమిటీలు ఎన్నిక
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం పరిధిలోని బిఆర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆది వారం ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నుండీ నూతన మండల కమిటీలను రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేయాలని, వాడబలిజలు ఆర్థికంగా, సామాజికంగా,విద్య,వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నామని వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కులం సర్టిఫికెట్లు,మత్స్య సొసైటీలో ప్రాతినిధ్యం, ఉండాలని, భవిష్యత్తు కర్తవ్యాలు నిర్ణయించుకు ని వాడబలిజల అభివృద్ధికి సమిష్టిగా క్రుషి చేద్దామంటూ పిలుపు నిచ్చారు. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించి, వాడ బలిజ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు సుదూర ప్రాంతా ల నుండి వచ్చినటువంటి పెద్దలు,యువకుల సమక్షంలో జిల్లా కమిటీలు,మండల కమిటీలు ఏకగ్రీవంగా హర్షద్వానా లమథ్య ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు గార ఆనంద్, గగ్గూరి రమణయ్య, కోశాధికారి బోట రమణయ్య, అధికార ప్రతినిధులు చింతూరి వెంకట్రావ్,తోట మల్లికార్జున్ రావు, చింతూరి గాంధీ, బొల్లె భాస్కర్,బొల్లె సూర్యం, తిరుపతమ్మ, బొల్లె సూరిబాబు, తోట ప్రశాంత్,గార మహేష్,బొల్లె నరేష్,గార పోశాలు,ఎర్రావుల ప్రేమ్,తదితరులుతో పాటు పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు ,యువకులు పాల్గొన్నారు.