ఎర్రమ్మ గుడి వద్ద మట్టి పనులు చేసిన ట్రాక్టర్ల సంఘం
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం గ్రామపంచాయతీ లోని ఎర్రగుంటపల్లి లో గల ఎర్రమ్మ గుడి వద్ద భూమి చదునుగా లేకపోవడం వల్ల భక్తుల సౌకర్యం కోసం ట్రాక్టర్ యూనియన్ సభ్యులు మట్టి కొట్టించారు. ఎర్రగుంటపల్లి యూత్ సభ్యులతో పాటు ట్రాక్టర్ యూనియన్ సభ్యులు మాచర్ల సత్యం, మాచర్ల రాజు, చీమల సత్యం, పసుల శంకర్, ఉప్పు సంతోష్ ల సహకారంతో దాదాపు 200 ట్రిప్పులు ఎర్రమ్మ గుడి వద్ద మట్టి కొట్టించారు. వారికి ఎర్రగుంటపల్లె ప్రజలు, యువత సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.