మంథనిలో సాప్ట్ వేర్ కంపెనీ స్టార్ట్
– ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
– త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: హైదరాబాదుకు దీటుగా మంథని ప్రాంతంలో సాప్ట్ వేర్ రంగంతో పాటు పలు పరిశ్రమలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని మంథని శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం నాడు మంథని పట్టణంలో తొలి సాఫ్ట్వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. మారుమూల మంథని నియోజకవర్గంలోని చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా, రాష్ట్ర ఐటీ పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారిం చారు. ఇందులో భాగంగా మంథని పట్టణంలో గోదావరిఖని రోడ్డుకు గల గిట్లస్ హబ్ వద్ద శనివారం హైదరాబాద్ కు చెందిన సెంట్ లేయన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ నూతన బ్రాంచ్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని మారుమూల ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపిం చడం చాలా సంతోషకరమని, రానున్న రోజులలో మంథని ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు కంపెనీలు రానున్నాయని, వాటితో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందని, నిరుద్యోగుల బాధలు తొలగుతాయని అన్నారు. మరి కొన్ని రోజులలో స్కిల్ యూనివర్సిటీని మన ప్రాంతంలో స్థాపించి విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి పూర్తి అవగాహన కల్పిస్తూ, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.