మండల విద్యాధికారిగా శ్రీదేవి బాధ్యతల స్వీకరణ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై పూర్తిస్థాయిలో మండల విద్యా శాఖ అధికారులను నియామకాలు చేపట్టింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మండల విద్యాధికారిగా ఐ.శ్రీదేవి నియమితులయ్యారు. కాగా శుక్రవారం శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఎంఈఓ శ్రీదేవిని కలిసి మండల పిఆర్టియు టీఎస్ ఉపాధ్యా యులు శాలువాతో సత్కరించి, పూల బొకే అందిం చి శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షు లు ఏ రవీందర్, ప్రధాన కార్యదర్శి అనపర్తి తిరుపతి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎన్ సురేష్ రావు, జిల్లా ఉపాధ్య క్షులు పి శ్రీనివాస్ రెడ్డి, భగవాన్ రెడ్డి, కాటారం కాంప్లెక్స్ ప్రధా నోపాధ్యాయురాలు ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.