శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు 

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు 

– రూ. లక్షా 29,438 ఆదాయం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని భక్తులు హుండీలలో వేసిన కానుకలను బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, అర్చక సిబ్బంది లెక్కించారు. ప్రతి ఏడాది జరిగే శ్రీ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాలు ఈనెల 11వ తేదీన అధ్యయనోత్సవంతో ప్రారంభమై, 18వ తేదీ చక్రతీర్థం నాగబలి తో ముగిశాయి. స్వామివారి హుండీ ఆదాయం రూ.  లక్షా 29 వేల 438 లుగా సమకూరినట్లు దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment