వెంకటాపురం మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : భద్రాచలం నియోజకవర్గంలోని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో దీర్ఘకాలికంగా పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించాలని, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ వెంకటాపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిడెం మోహన్ రావు మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. బుధవారం హైదరాబాదులో అసెంబ్లీ లాబీలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ద్వారా మంత్రి పొంగులేటిని కలుసుకొని వివిధ సమస్యలపై ప్రత్యేక నిధులు కేటాయించాలని ఏజెన్సీ మండలమైన వెంకటాపురం గిరిజన ప్రాంతానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. అలాగే పాలెం వాగు ప్రాజెక్టు కు మరమ్మత్తులు నిర్వహించాలని, భద్రాచలం టు వెంకటాపురం ప్రధాన రహదారి మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, రాళ్ళవాగు వంతెన రిపేర్లు చేయాలని, పలు సమస్యలపై మంత్రికి విన్నవించి వినతి పత్రం అందజేశారు.