శ్రీ వేంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాల దరఖాస్తులకు ఆహ్వానం.
– బధిరుల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె లక్ష్మీనర్సమ్మ
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : 2024-25 విద్యా సంవత్సరం నకు గాను ప్రవేశాలకు ములుగు జిల్లా నుంచి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు శ్రీ వేంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు జె లక్ష్మీనర్సమ్మ గురువారం తెలిపారు. ములుగు జిల్లాలోని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థుని విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులనీ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు వారు ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాల – మయూరి గార్డెన్ లైన్, ప్రగతి నగర్ కాలనీ ఫేస్-2, పోస్ట్ ఎన్ఐటి, హన్మకొండ జిల్లా లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 38 సంవత్సరాల నుండి దాదాపు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్యాబోధన, వసతి గృహం కల్పిస్తూన్నామని,మా పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యా ర్థులు 100 శాతం రిజల్ట్స్ తో ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత అవ్వటం జరుగు తుందన్నారు.ఈ దరఖాస్తులు ఏప్రిల్ 30 వరకు తీసుకోబడుననీ ఆమె తెలిపారు. దరఖాస్తుతో పాటు తప్పని సరిగా ఈ క్రింది తెల్పిన పత్రాలను జతపర్చుటకు తీసుకొని రాగలరనీ అన్నారు. వికలాంగుల సదరం (సదరం) సర్టిఫికెట్,పుట్టిన తేది సర్టిఫికెట్,స్టడీ (స్టడీ) సర్టిఫికెట్, కులం, ఆదాయం ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పత్రం, 4 పాస్ ఫోటోలు మిగతా వివరాలకు మా ఫోన్ నెంబర్లు 6300585912, 9440739423, 8801117608, 9866673486, 8008136309 సంప్రదించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు శ్రీ వేంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాల, మయూరి గార్డెన్ లైన్, ప్రగతి నగర్ కాలనీ ఫేస్-2, పోస్ట్: ఎన్ఐటి, జిల్లా: హన్మకొండ, తెలంగాణ రాష్ట్రం – 506004 అడ్రస్ ను సంప్రదించాలని ఆమె తెలిపారు.