ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు

ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు

ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు

కాటారం,తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యా యి. ఉదయం నుండే భక్తులు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ దైవదర్శనం చేసుకున్నారు కాలేశ్వరంలోని రామాలయం, కాటారంలోని శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయం, బొప్పారంలోని శ్రీ సీతారామచంద్ర దేవస్థానం, బొమ్మపూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గారేపల్లి లో ఆంజనేయ స్వామి ఆలయం, ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిలో శ్రీధర్ బాబు కుటుంబం ద్వారా నిర్మితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి రోజున శ్రీ సీతారామ భక్తాంజనేయ దేవత మూర్తులకు ప్రత్యేక పంచామృతాభిషేకములు నిర్వహించారు. మధ్యాహ్నం సీతా రాముల కళ్యాణం మహోత్సవానికి అంకురార్పణగా శనివారం పాలపొరుక, సాయంత్రం ఎదురుకోలు కార్యక్రమం నిర్వహిం చారు. ధన్వాడ గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించే సీతారాముల కళ్యాణం మహోత్సవం కి మంత్రి శ్రీధర్ బాబు మాతృమూర్తి జయమ్మ, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. ధన్వాడలో పురోహితులు శ్రీరాంభట్ల కృష్ణమోహన్ శర్మ కాటారంలో నిఖిల్ శాస్త్రి చార్యులు పూజలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment