ఉరి వేసుకొని వ్యాపారి మృతి
ములుగు, తెలంగాణ జ్యోతి : ఉరి వేసుకుని వ్యాపారి మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలో ధనలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ షాప్ పేరు మీద వ్యాపారం నిర్వహిస్తున్న అంకం దేవేందర్ (52) అనే వ్యాపారి తన ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. భార్య కొడుకు కుమార్తె హనుమకొండ కు వెల్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మూడవ అంతస్తులో ఉరివేసుకొని మృతి చెందాడు. షాపులో పనిచేస్తున్న అబ్బాయి గుర్తించి హుటాహుటిన చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దావకానాకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు దృవీకరించారు. దేవేందర్ ఉరేసుకొని మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది