శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీ లెక్కింపు.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం యొక్క హుండీలను ఈరోజు ఉదయం 10 గంటల నుండి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. మహేష్ ఆధ్వర్యంలో టి.సాయిబాబ పర్యవేక్షణలో హుండీలు తెరిచి డబ్బులు లెక్కించడం జరిగినది. సదరు హుండీలలో 76 రొజులకు గాను 22,78,554/-రూపాయల ఆదాయం వచ్చినది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్. ప్రసాద్, దేవస్థానం సిబ్బంది మరియు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి కామారెడ్డి సభ్యులు 75 మంది, శ్రీ ముక్తీశ్వర సేవా సమితి రాగినేడు సభ్యులు 13 మంది శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు హైదరాబాద్ వారు మరియు దేవస్థానం అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు