గుర్రేవుల పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు
– విజేతలకు బహుమతుల ప్రధానం
కన్నాయిగూడెం, నవంబర్ 16,తెలంగాణ జ్యోతి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుర్రేవుల జెడ్పిహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో యునైటెడ్ వే హైదరాబాద్ అనే ఎన్‌జీఓ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు షీల్డ్‌లు, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను ఆ సంస్థ ములుగు జిల్లా ప్రతినిధి టి. రమేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు జమున, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉపాధ్యాయులు శ్యాంసుందర్, పాపయ్య, కవిత, రమేష్, రవీందర్, ఏఏపీసీ చైర్మన్ నర్సమ్మ, పి.ఈ.టి. కుమారస్వామి, సి.ఆర్.పి. రమేష్, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.





