దత్తాత్రేయ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు

దత్తాత్రేయ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు

– పూజలలో పాల్గొన్న ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దంపతులు

          కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , ఆయన సతీమణి శైలజ రామయ్యర్ ఐ ఎ ఎస్ దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు పండ్లరసాలతో అర్చకుల వేద మంత్రాలు మధ్య అభిషేకాలను నిర్వహించారు. అనం తరం స్వామివారి మూలవిరాట్ కు విశేష ఉపచార పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలను సమర్పించారు. దేవాల య ప్రాంగణంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి దత్త హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి దంపతు లకు తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై చూపాలని వేడుకున్నట్లు తెలిపారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment